ఆర్యులారా! పసిడి మనసు కలిగిన పసి బాలుర హృదయాలలోగల ఎవరికీ చెప్పుకోలేని, చెప్పుకోవడం చేతకాని ఆవేదనను బాలభావనగా మీముందుంచుతున్నారు. మీరు అర్థం చేసుకొని, వారికి అనుకూలంగా జీవించే మహద్భాగ్యం కలిగించడం కోసం, మీరు మీ నడవడికలో ఏవైనా మార్పులు చేసుకోవలసి వస్తే తప్పక చేసుకొని పసిమొగ్గలు వికసించేటందుకు దోహద పడగలరని ఆశిస్తూ ఆ చిన్నారులకే ఈ శతకం అంకితం చేస్తున్నాను.దయచేసి, ఓపికగా చదివి అనుసరించ వలసినదిగా నా మనవి.
మీ అమూల్యమైన అభిప్రాయాలను వ్రాసి ప్రోత్సహించ గోరుచున్నాను.